సుప్రీమ్ కోర్ట్ లో కార్తీ చిదంబరంకు ఊరట

SMTV Desk 2019-01-30 16:01:34  Chidambharam, Karthi Chidambharam, Supreme Court

న్యూ ఢిల్లీ, జనవరి ౩౦: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, సుప్రీమ్ కోర్ట్ కార్తీ చిదంబరంకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మీరు ఎక్కడకు వెళ్లాలనుకుంటే అక్కడకు వెళ్లండి. ఏమి చేయాలనుకుంటే అది చేయండి. కానీ చట్టంతో ఆటలాడవద్దు. విచారణ సంస్థలకు సహకరించండి. సహకరించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. భారీ ఎత్తున మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది.

ఈ కేసుకు సంబంధించి మర్చి 5, 6, 7, 10 తేదీల్లో ఈడీ ముందు హాజరుకావాలని కార్తీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన విదేశీ ప్రయాణానకి ముందు రూ.10 కోట్లు డిపాజిట్‌ చేయాలని తెలిపింది. టెన్నిస్ టోర్నమెంట్ కొరకు కార్తీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూకే, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ లకు వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా సుప్రీంను కోరారు.