చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘువీరారెడ్డి..

SMTV Desk 2019-01-30 16:01:03  Chandrababu, raguveera reddy, ap, tdp, congress, bjp, ap special status

జనవరి 30: నేడు ఏపీ సీఎం చంద్రబాబు తలపెట్టిన అఖిలపక్ష సమావేశంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనకు ఆహ్వానం కూడా పంపలేదని దుయ్యబట్టారు. తనను కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జంగా గౌతమ్ ను ఆహ్వానించడం సరికాదని అన్నారు. అఖిలపక్షాన్ని తాను ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించిన దానిపై చంద్రబాబు ఇంతవరకు స్పందించలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని... హోదాను ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు.