ట్రాఫిక్ మధ్యలో మహాత్ముడికి నివాళులు

SMTV Desk 2019-01-30 15:58:14  Hyderabad, Mahatma Gandhi death Anniversary, Tirumalagiri Traffic Police

హైదరాబాద్, జనవరి ౩౦: జాతి పిత మహాత్మా గాంధీ 71వ వర్ధంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ తిరుమలగిరి పోలీసులు విధుల నిర్వహణ మధ్యలో గాంధీకి నివాళులు అర్పించారు. నిత్యం రద్దీగా ఉండే తిరుమలగిరి చౌరస్తాలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిలబడి రెండు నిమిషాల పటు మౌనం పాటించి గాంధీ కి ఘన నివాళులు అర్పించారు. ఈ సమయం లో రోడ్డుపై వాహనాల రాకపోకలను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. వాహనదారులు కూడా మహాత్ముని మీద గౌరవంతో హరన్లను మోగించకుండా పోలిసులతో పాటు మౌనం పాటించారు.