రవితేజ రెమ్యూనరేషన్...50%

SMTV Desk 2019-01-30 15:56:11  Raviteja, Amar akbar anthony, Touch chesi choodu, Nela ticket, Disco raja, VI Anand, Ram talloori, Remunaration

హైదరాబాద్, జనవరి 30: వరుస డిజాస్టర్ లతో కొట్టు మిట్టాడుతున్నమాస్ మహారాజ రవితేజ మరో సినిమాకు సిద్దం అయిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు ఫ్లాప్ లు ఉన్న ఈ హీరోతో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు విఐ ఆనంద్. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు డిస్కో రాజా అని టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాకి రవితేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే విషయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కోసం దాదాపు రూ.10 కోట్లను రెమ్యునరేషన్ గా తీసుకున్న రవితేజ ఇప్పుడు సగానికి సగం రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం.

దానికి కారణం నిర్మాత రామ్ తాళ్లూరి అని తెలుస్తోంది. గతంలో రవితేజ నటించిన నేల టికెట్టు సినిమాను నిర్మించిన ఇతడే. ఆ సమయంలోనే రవితేజ మీతో మరో సినిమా చేస్తానని నిర్మాతకు మాటిచ్చాడట. దాని ప్రకారమే ఇప్పుడు సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా అని రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేయలేడు కదా.. అందుకే తన రెమ్యునరేషన్ లో సగానికి సగం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ ఈ వొక్క సినిమా కోసమా..? లేక ఇదే కంటిన్యూ చేస్తాడా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది!