ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే : రామ్

SMTV Desk 2019-01-30 15:29:57  Ram Pothineni, AP CM, Chandrababu, Twitter

హైదరాబాద్, జనవరి 30: ప్రముఖ సినీ నటుడు రామ్ పోతినేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిన్న తన అధికార ట్విట్టర్ వేదికగా ప్రశసించిన విషయం తెలిసిందే.అయితే ఆ ట్వీట్ కు నెటిజన్లు విభిన్న స్పందన తెలియజేశారు. అభివృద్దికి అండగా నిలిచిన హీరో అని కొందరు ప్రశసించగా మరికొందరు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నావ్ అంటూ కామెంట్స్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ రామ్ మరో ట్వీట్ చేశాడు.నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే. ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సలు లేదు.

ముందు నేను పౌరుడిని.. ఆ తర్వాతే నటుడిని అంటూ ట్వీట్ చేశాడు.