చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్..

SMTV Desk 2019-01-30 15:21:18  Chandrababu, anil kumar yadav, tdp, ycp

నెల్లూరు, జనవరి 30: వైసీపీ నేత, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మద్దతుదారులు, కార్యకర్తల ఓటు హక్కును తొలగించే ప్రక్రియను టీడీపీ నేతలు చేపట్టారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. కాగా సర్వేల పేరుతో వచ్చేవారికి ఎలాంటి వివరాలు చెప్పొద్దని ప్రజలను కోరారు.

ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. జరగబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతోనే ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సర్వేల పేరుతో వివరాలు కోరుతూ వచ్చేవారి విషయంలో ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.