కోట్ల చేరికపై స్పందించిన కేఈ కృష్ణమూర్తి..

SMTV Desk 2019-01-30 15:00:03  chandrababu, kotla suryaprakash reddy, tdp, kurnool, ke krishnamurti, elections 2019

జనవరి 30: తెలుగుదేశం పార్టీలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరటంతో ఆ ప్రభావం మంత్రి కేఈ కృష్ణమూర్తిపై గట్టిగా పడుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కేఈ కృష్ణమూర్తి ఈరోజు భేటీ అయ్యారు. అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు మగిసిన సందర్బంగా సీఎం ఛాంబర్ కు వెళ్లిన మంత్రి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపైనే తాను చంద్రబాబుతో చర్చించానని తెలిపారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడంపై ముఖ్యమంత్రితో చర్చించలేదన్నారు.

అయితే ఈ విషయాన్ని చంద్రబాబు కూడా తన వద్ద ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. కోట్ల చేరికపై తాను మాట్లాడననీ, చంద్రబాబు అడిగితే మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తానన్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబీకులు ఏయే స్థానాలను కోరుతున్నారన్న సంగతి తనకు తెలియదని చెప్పారు.