పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

SMTV Desk 2019-01-30 14:46:19  Telangana Panchayat polls, counting, polling, Election Commission

హైదరాబాద్, జనవరి ౩౦: తెలంగాణలో తుది దశ పంచాయతి ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3,529 పంచాయతీల్లో ఓటర్లు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అధికారులు మొత్తం 32,055 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,667 మంది సర్పంచి అభ్యర్థులతో పాటు వార్డుల్లో 67,316 మంది పొటీలో దిగారు.

అధికారులు పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రారభించారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచి అభ్యర్థుల ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఆయా పంచాయతీల్లో ఉప సర్పంచి ఎన్నిక చేపట్టనున్నారు.