ఆనర్ వ్యూ20 రివ్యూ

SMTV Desk 2019-01-30 14:05:50  Honor view 20, Latest Mobiles, Honor, Huwai, New Mobile

ఈమధ్య కాలం లోనే పలు దేశాలలో విడుదలైన ఆనర్ వ్యూ20 స్మార్ట్ ఇప్పుడు భారతదేశం లో కూడా విడుదలయ్యింది. దీని ప్రత్యేఖత హోల్ పంచ్ సెల్ఫీ . అలాగే, 48 ఎంపి రియల్ కెమరా తో వస్తున్నా మొదటి ఫోన్ ఇది. 6 జీబీ/8 జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండనుంది. నేటి నుండే అమెజాన్, ఆనర్ స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ పై జియో, పేటీఎం, ఐసీఐసీఐ సంస్థలు పలు ఆఫర్లని ప్రకటించాయి. ఈ ఫోన్ కొనుగోలు చేసే జియో కస్టమర్లకు రూ.2200 క్యాష్ బ్యాక్ తో పాటు 2.2 టీబీ డేటా ఉచితంగా లభించనుండగా, పేటీఎం వినియోగదారులకి రూ.1,400 క్యాష్ బ్యాక్ లభించనుంది, ఐసీఐసీఐ కార్డుల ద్వారా 5 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. 6 జీబీ ఫోన్ ధర రూ.37,999, 8 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.45,999గా ఉన్నాయి. 6.4 అంగుళాల పొడవు కలిగిన ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా 25 మేగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ను కలిగి ఉంది. 128జీబీ, 256 జీబీ ఇన్‌బిల్డ్ స్టోరేజీ వేరియంట్లు కూడా ఉన్నాయి.