విద్యాబాలన్ అడల్ట్ కామెంట్స్...

SMTV Desk 2019-01-30 13:49:02  Vidhyabalan, Sex, Comments On sex, Adult comments

ముంభై, జనవరి 30: బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ పలు ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విద్యాబాలన్ కు నలభై ఏళ్ల వయసుకి దగ్గర పడుతుంది. ఈ క్రమంలో ఆమె ఈ వయసుకి చెందిన మహిళలు ఎలా ఉంటారనే విషయంపై స్పందిస్తూ తనకు నచ్చిన కొన్ని థియరీలు చెప్పుకొచ్చింది. నలభై ఏళ్ల తరువాతే స్త్రీలకు అసలైన జీవితం మొదలవుతుందని ఆమె చెబుతోంది. ఆ వయసులో మహిళలు మరింత హాట్ గా మారతారని, ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోకుండా ఆనందంగా ఉంటారని అంటోంది.

ముప్పై ఐదు దాటిన తరువాత మహిళల ఆలోచనల్లో మార్పులు వస్తాయని, నలభైకి వచ్చిన తరువాత వారు మరింత స్వేచ్చగా ఉంటారని చెబుతోంది. నలభై ఏళ్ల వయసు వారి సెక్సువల్ లైఫ్ గురించి కూడా కామెంట్స్ చేసింది ఈ భామ. నలభైలోకి వచ్చిన స్త్రీలు సెక్స్ లో ఎంజాయ్ మెంట్ ను పట్టించుకోరనే అభిప్రాయం కూడా తప్పని వాదిస్తోంది. ఆ వయసులో వారు సెక్స్ ను మరింతగా ఆస్వాదిస్తారని చెప్పుకొచ్చింది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో కనిపించింది విద్యాబాలన్. తమిళంలో కూడా ఓ సినిమాలో నటిస్తోంది.