జూ.పవర్ స్టార్....స్టైలిష్ లుక్

SMTV Desk 2019-01-30 13:38:05  Pawan kalyan, Akhiranandan, Renu desai

హైదరాబాద్, జనవరి 30: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ ఇప్పుడు సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అని మెగా అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ ఇక సినిమాలు తీయడు అనే లోటు అఖిరా బాబు తీరుస్తాడు అని అభిమానులు ఆశావాహులుగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అఖిరానందన్ కి సంబంధించి స్టైలిష్ లుక్ ని చూసిన అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

అయితే అఖిరాను జూనియర్ పవర్ స్టార్ అని పిలవొద్దని గతంలో రేణుదేశాయ్ చెప్పింది. అలా పిలిస్తే వారిని సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చింది. కానీ అభిమానులు మాత్రం అఖిరాను చూసి జూనియర్ పవర్ స్టార్ అని పిలవకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమా చేశాడు అఖిరా. అయితే అతడిని హీరోగా పరిచయం చేస్తారా..? లేదా..? అనే విషయంలో స్పష్టత లేనప్పటికీ అఖిరా ఫోటోలను చూస్తోన్న అభిమానులు మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.