యూనివర్సల్ బేసిన్ ఇన్‌కమ్‌ ​ఓన్లీ ఫర్ 15 మెంబర్స్

SMTV Desk 2019-01-30 13:33:50  Rahul Gandhi, Narendra Modi, Universal Basin Income, Minimum Income Scheme, Neerav Modi, Mehul Choksi, Vijay Malya

న్యూ ఢిల్లీ, జనవరి ౩౦: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని కొచ్చిన్ ర్యాలి లో పాల్గొన్నారు. సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టనున్న యూనివర్సల్ బేసిన్ ఇన్‌కమ్‌
(యూబీఐ) పథకం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం లో మోడీ కేవలం 15 మంది సంపన్నులకే యూబీఐ పథకం వర్తింప చేస్తారని ఆయన పేర్కొన్నారు.



ప్రధాని కేవలం 15 మంది సంపన్నులకు మాత్రమే రాబడి గ్యారంటీ ఇస్తారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వొక్క భారతీయునికి కనీస ఆధాయం సమకూరేటట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లుగా ప్రధాన మంత్రి దేశంలోని 15 మందికి గరిష్టమైన ఆదాయవనరులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. కర్ణాటక, కేరళ, వొడిశానుంచి ఉద్యోగాలను తస్కరించారని, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థలను పక్కనపెట్టి అనిల్‌ అంబానికి కాంట్రాక్టులు ఇప్పించారని ఆరోపించారు. పరారీ లో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు నీరవ్ మోడీ 45వేల కోట్లు, మెహుల్‌చోక్సీ 30వేల కోట్లు, విజయ్ మాల్య 10వేల కోట్లు ఆర్దిక నష్టం చేసి వీదేశాలకు వెళ్ళిన ప్రధాని పట్టించుకోరని తీవ్రస్థాయిలో రాహుల్‌ మందిపడ్డారు.