ఈసారి చంద్రబాబుని టార్గెట్ చేసిన మెగా బ్రదర్ ..

SMTV Desk 2019-01-30 13:29:05  nagababu, balakrishna, ys jaganmohan reddy, tdp , chandrababu

జనవరి, 30: మొన్న నిన్నటి వరకు బాలకృష్ణ, జగన్ లను టార్గెట్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేసారు. గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలపై విమర్శలు చేస్తూ.. తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో రిలీజ్ చేశారు. గతంలో సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ పొరపాటున నోరుజారి..‘‘ ఈ రోజు భారతదేశం మొత్తం మీద వొకసారి చూస్తే.. అవినీతిలో కానీ, అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. చంద్రబాబు చేసిన కామెంట్స్ పై నాగబాబు తన స్టైల్ లో పంచ్ లు వేశారు.

ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలకు ఓ పొడుపుకథ పొడిచారు అందులో వొక నిజం.. మరో అబద్ధం ఉందని నాగబాబు అన్నారు. అవి ఏంటో చెప్పండి అంటూ ప్రేక్షకులకి 10 సెకన్ల టైం ఇచ్చారు. ఇక మీరు చెప్పలేరు అంటూ.. అవి ఏంటంటే.. అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానం అబద్ధమని.. అవినీతిలో నెంబర్ వన్ స్థానం నిజమని.. ఇదే చంద్రబాబు చెప్పారన్నారు. మనకి ఇంతకంటే పొడుపుకథలు, నిజాలు చెప్పేవారు ఎవరు ఉంటారు.. వొకసారి చంద్రబాబు కి ఓ వేసుకోండి అంటూ.. తనదైన శైలిలో వ్యంగస్త్రాలు విసిరారు.