యదాద్రిలో మోడల్ బస్ స్టేషన్‌

SMTV Desk 2019-01-30 13:24:58  Yadadri, Model Bus Station, RTC ED Purushotham

యదాద్రి, జనవరి ౩౦: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యదాద్రి పునఃనిర్మాణ పనులు శరవేగంగా పుర్తవుతున్నాయి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం యాదగిరిగుట్టలో మోడల్‌ ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం 1 4 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు.

సైదాపురం పరిధిలో 10 ఎకరాల్లో బస్‌డిపో, యాదాద్రి కొండ వెనుక నాలుగు ఎకరాల్లో బస్‌స్టేషన్ నిర్మించున్నట్టు చెప్పారు. ఇందుకు మరో ఎకరం స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్‌కు సూచించామన్నారు. అంతేకాకుండా మల్టీప్లెక్స్, ఫుడ్‌కోర్ట్సు, వెయిటింగ్‌హాల్‌తోపాటు ఏసీ మీటింగ్ ‌హాల్ కూడా నిర్మిస్తామని తెలిపారు.