సూపర్ స్టార్ రిజెక్ట్, యాంగ్ హీరో ఆక్సెప్ట్

SMTV Desk 2019-01-30 12:53:39  Superstar Mahesh babu, Raj tarun, Dil raj, Ashok galla

హైదరాబాద్, జనవరి 30: షార్ట్ ఫిల్మ్స్ తో అందరినీ మెప్పించిన రాజ్ తరుణ్ ప్రస్తుతం ఫ్లాప్ లతో మునిగి ఉన్నాడు. తాజాగా రాజ్ తరుణ్ కి ఓ విభిన్న కథ ఎదురైంది. దిల్ రాజు నిర్మాతగా మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ చేశారు. అయితే కొంత కాలం తరువాత ఆ కథ మహేష్ బాబుకి నచ్చకపోవడంతో ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేశారు. అయితే ఇప్పుడు దిల్ రాజు అదే సినిమా రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కథలో ఎలాంటి మార్పులు చేయకుండా రాజ్ తరుణ్ కు సరిపోయే సబ్జెక్ట్ కావడంతో దిల్ రాజు, దర్శకుడు కృష్ణారెడ్డి సిద్దమవుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మరి అసలే ఫ్లాప్స్ లో ఉన్న రాజ్ తరుణ్. సూపర్ స్టార్ మహేష్ బాబుకి నచ్చని కథని ఓకే చేస్తాడో లేదో చూడాలి. దిల్ రాజు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఇంతకు ముందు "లవర్" అనే సినిమా వచ్చి ఫ్లాప్ గా నిలిచింది.