మార్ఫింగ్ చేసినందుకు కేసు ఫైల్ ..

SMTV Desk 2019-01-30 12:26:06  Utter pradesh, Akshilesh yadav, MAyawathi, Sp, BSP, Morphing photos, Social media

మధుర, జనవరి 30: ఉత్తర్ ప్రదేశ్ లో సోషల్ మీడియా వేదికగాజరిగిన ఘటన , వొక వ్యక్తి అత్యుత్సాహం వాళ్ళ జైలు పాలు అయ్యే సూచనలు కనపడుతున్నాయి. విషయానికొస్తే బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లపై అసభ్యకరమైన పోస్టును షేర్ చేసిన విశేష్ రాఠీ అనే వ్యక్తిపై మధుర పోలీసులు కేసు నమోదు చేశారు. మాయావతిని అఖిలేష్ భుజాలపై ఎత్తుకున్నట్టు మార్ఫింగ్ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. కాగా, మాయావతి తన కోసం భర్త కావాలని డిమాండ్ చేస్తోందని కామెంట్ పెట్టారు. దీంతో, లోహియా వాహిని సంస్థ నేత మున్నామాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నాయకులపై అభ్యకరమైన పోస్ట్ పెట్టడం ద్వారా వారి పరువుకు భంగం కలిగించారని, పార్టీ కార్యకర్తల మనోభావాలను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో విశేష్ రాఠీపై ఐటీ యాక్ట్ 66 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.