వరల్డ్ చెస్ ఛాంపియన్ వీడ్కోలు...

SMTV Desk 2019-01-30 11:49:43  Vladimir kramnik, World chess champion, Russia, Resign

మాస్కో, జనవరి 30: మాజీ ప్రపంచ ఛాంపియన్‌, రష్యా గ్రాండ్‌మాస్టర్‌ వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ తను మూడు దశాబ్దాల పాటు కొనసాగిస్తున్న చెస్ ఆటకు తాజాగా వీడ్కోలు చెప్పాడు. క్రామ్నిక్‌ 1996లో ప్రపంచ నంబర్ వన్ గా నిలిచాడు. అప్పట్లో అతిపిన్న వయసులో ప్రపంచ నంబర్‌వన్‌ అయిన రికార్డు అతనిదే. 2010లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆ రికార్డును అధిగమించాడు.

2000లో గ్యారీ కాస్పరోవ్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌ అయిన తర్వాత ఏడేళ్ల పాటు ఆ కిరీటాన్ని నిలబెట్టుకున్నాడు. 2007 విశ్వనాథన్‌ ఆనంద్‌ చేతిలో ఓడిపోయేంత వరకు ప్రపంచ చెస్‌ ట్రోఫీ క్రామ్నిక్‌దే. తాజాగా నెదర్లాండ్స్‌లో ముగిసిన టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీయే 43 ఏళ్ల క్రామ్నిక్‌ కెరీర్‌లో ఆఖరిది.