తెలంగాణ ఎన్నికలలో వార్ వన్ సైడే ..

SMTV Desk 2019-01-30 11:00:33  Kavitha, Lokhsabha elections, Telangana state, Congress, Bjp, Secretariat issue, War one side

హైదరాబాద్, జనవరి 30: రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురునిలిచే పార్టీ మరేదీ లేదని, వార్ వన్ సైడ్ గా జరగనుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో 16 తమవేనని, మిగిలిన వొక్క సీటునూ ఎంఐఎం గెలుచుకోనుందని జోస్యం చెప్పారు. నూతన సచివాలయం నిమిత్తం రక్షణ శాఖ అధీనంలో ఉన్న భూమిని కోరుతుంటే, కేంద్రం సహకరించడం లేదని, కేంద్రంపై వొత్తిడి పెంచేందుకు నేడు ఢిల్లీకి వెళ్లనున్నామని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎంపీలు నిలదీయనున్నారని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కేవలం గరీబీ హఠావో వంటి నినాదాలకు మాత్రమే పరిమితమయ్యారని, ప్రియాంక వచ్చినా దేశానికి లభించే ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల ప్రభుత్వం ఏర్పడితేనే అన్ని రాష్ట్రాలకూ మేలు కలుగుతుందని కవిత అభిప్రాయపడ్డారు.