'మణికర్ణిక' సోనూ సూద్ వీడియో లీక్

SMTV Desk 2019-01-29 18:06:50  Manikarnika, Kangana ranaut, Krish jagarlamudi, Sonu sood, Video leak

ముంభై, జనవరి 29: కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా తెరేకేక్కిన చిత్రం మణికర్ణిక . ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. రూ. 100కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. సినిమాలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సదాశివ్‌ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే 45 రోజులు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత సినిమా నుంచి తప్పుకొన్నారు. సోనూ తప్పుకున్న తర్వాత ఆ పాత్రలో మహ్మద్‌ జీషన్‌ అయుద్‌ నటించారు.

తాజాగా, సోనూసూద్ పాత్రకు సంబంధించిన వీడియో లీక్‌ అయ్యింది. అందులో సోనూ పవర్‌ఫుల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. కుస్తీలో మరోవ్యక్తిని ఓ పట్టుపడుతూ కనిపించాడు. ఇపుడీ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు కంగన దర్శకత్వం వహించారు. కంగన మొత్తం స్క్రిప్టులో మార్పులు చేసే అధికారం తీసుకోవడం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.