గురుకులాల్లో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

SMTV Desk 2019-01-29 18:03:31  unemployment, TS gurukulam recruitment 2029, CM KCR

హైదరాబాద్, జనవరి 29: సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రతి నియోజకవర్గంలో గురుకులం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ని అమలు చేయడంలో భాగంగా 119 గురుకుల పాఠశాల ఏర్పాటుకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో పాటు 3వేల 689 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జేఎల్, టీజీటీ పోస్టులతో పాటు పలు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులతో పాటు గురుకులాల్లో 595 ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు.

ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2019-20 విద్యాసంవత్సరానికి పీజీటీ, పీడీ, జేఎల్‌ పోస్టులు మినహా మిగతా 2,537 పోస్టులు మంజూరయ్యాయి. వీటికి సర్వీసు నిబంధనలు పూర్తిచేసిన తర్వాత ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశముంది. ఇక 2020-21 విద్యా సంవత్సరానికి గురుకులాల్లో 833 పీజీటీ పోస్టులను, 2021-22 సంవత్సరానికి 119 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కేటాయించింది. 2022-23 నాటికి పాఠశాలలు జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అవుతాయి. అప్పుడు 833 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు ఉంటాయి.