గ్రీన్‌ గోల్డ్‌ బయోటెక్‌ ఎండీ శ్రీకాంత్‌ అరెస్ట్...!

SMTV Desk 2019-01-29 17:29:23  Green gold Biotech, Srikanth Arrest, Uppal Police Station, Rachakonda Police

హైదరాబాద్, జనవరి 29: లక్ష రూపాయలు చెల్లిస్తే వేరు సెనగ గింజల నుంచి నునే తీసే యంత్రాలు ఇస్తామని అంతే కాకుండా ప్రతి నెలా నునే తీసి ఇస్తే, నెలకు రూ. 20 వేలు సంపాదించుకోవచ్చని ప్రజలను నమ్మించి, కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన గ్రీన్‌ గోల్డ్‌ బయోటెక్‌ ఎండీ శ్రీకాంత్‌ ను నేడు రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ మాటలు నమ్మి లక్ష రూపాయలు డిపాజిట్ చేసి మోసపోయిన భాదితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.


భాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారం రోజుల పాటు దర్యాప్తు చేసి, శ్రీకాంత్ ప్రజలను మోసం చేసాడని నిర్ధారించారు. శ్రీకాంత్‌, గతంలోనూ పలు ఆకర్షణీయమైన స్కీములను ప్రకటించి, ప్రజలను మోసం చేశాడు. గతంలో అతనిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసారు. ఇప్పుడు అతని అరెస్ట్ తో పాత కేసులని కూడా పోలీసులు విచారణ జరపనున్నారు.