వెంకయ్యను కలిసిన రామకృష్ణ ప్రత్యేక బృందం

SMTV Desk 2019-01-29 17:22:57  Konathala Ramakrishna, Venkaiah Naidu, AP Special Status

న్యూ ఢిల్లీ, జనవరి 29: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రత్యేక బృందం ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని ఈ బృందం మంగళవారం వెంకయ్యను కలిసింది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే బడ్జెట్‌, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ఏపీకి న్యాయం చేయాలని కోరామని కొణతాల చెప్పారు. తాము చేసిన విజ్ఞప్తిపై వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించారని, ఏపీకి చేతనైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.