'వాల్మీకి' కి వార్నింగ్...

SMTV Desk 2019-01-29 16:59:30  Varun tej, F2, Valmiki, Harish shanker, Valmiki sanghalu, Valmiki title

హైదరాబాద్, జనవరి 29: వరుస విజయాలతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ కు ఈ మధ్య వచ్చిన ఎఫ్ 2 సినిమా భారీ హిట్ తెచ్చి పెట్టింది. నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న వాల్మీకి సినిమా ఈ మధ్యే ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమాకు అప్పుడే అడ్డంకులు మొదలయ్యాయి. ఈ సినిమా టైటిల్ ను వాల్మీకి వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో సినిమాకు స్టార్టింగ్ లోనే అంతరాయాలు ఏర్పడ్డాయి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాకు సంబందించిన టైటిల్ లోగోపై రివాల్వర్ ఉండడం తమ వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని వాల్మీకి సంఘం అధినేత సాయి ప్రసాద్ తెలియజేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన వెంటనే సినిమా టైటిల్ ను మర్చి తమ మనో భావాలను దెబ్బ తీసినందుకు చిత్ర యూనిట్ క్షమాపణ చెప్పాలని అన్నారు. టైటిల్ పై రివాల్వర్ ఉండడం తమ సామజిక వర్గాన్ని అవమానించడమే అని చెబుతూ.. వెంటనే వాల్మీకి టైటిల్ ను మార్చాలని లేదంటే సినిమా షూటింగ్ ను అడ్డుకుంటామని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు హెచ్చరించారు వాల్మీకి పేరుపై భక్తిరస ఆత్యాద్మిక సినిమాలు చేస్తే తమకు అభ్యంతరం లేదని కానీ వినోదం పేరుతో తమ సామజిక వర్గం పేరును కించేపరిచేలా వాడుకుంటే సహించేది లేదని అన్నారు. ఈ వివాదంపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.