చిన్నమామకి శ్రీరెడ్డి విస్సెస్

SMTV Desk 2019-01-29 16:40:20  Venkatesh, Varun tej, Tamannah, Mehreen, F2 Movie, sri reddy, sri reddy comments on venkatesh

హైదరాబాద్, జనవరి 29: ఆ మధ్య క్యాష్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు ఇండస్ట్రీలో దుమారం రేపిన శ్రీ రెడ్డి తాజాగా మరో పోస్ట్ తో సంచలనం రేపింది. తాజాగా శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ కౌంటర్లు స్టార్ట్ చేసింది. ఈసారి హీరో వెంకటేష్‌పై ఈ అమ్మడు ఫోకస్ పెట్టింది. ఎఫ్-2 సినిమా హిట్ పై పోస్ట్ పెట్టి వెంకీ మామా అంటూ వెటకారం మిక్స్ చేసింది. తాజాగా శ్రీరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో “చినమామ, అదే మా వెంకీ మామ మూవీ పెద్ద హిట్ అంటగా.. కంగ్రాచ్యులేషన్స్ మామా, నా 90 డిగ్రీస్ డైలాగ్ కూడా వాడారంటగా”.. అంటూ పోస్ట్ పెట్టింది. ఇంతకీ శ్రీరెడ్డి వెంకటేష్ ని మామ అని ఎందుకు సంబోదించిందో అర్దమైపోయే ఉంటుందిగా.

క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేసిన టైమ్ లో దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో క్లోజ్ గా ఉన్న ఫొటోలను లీక్ చేసింది. కొన్నిరోజుల పాటు ఈ ఎపిసోడ్ కొనసాగినా చివరకు పెద్దలు సర్దుబాటు చేశారు. ఇక శ్రీరెడ్డి కూడా ఈ విషయంపై ఎక్కడా నోరు మెదపలేదు. చెన్నైకి చెక్కేసిన తర్వాత కేవలం పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీపైనే ఫోకస్ పెట్టి ఫేస్ బుక్ మెసేజ్ లతో రెచ్చిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దగ్గుబాటి ఫ్యామిలీని టచ్‌ చేసింది. అభిరామ్ తో తనకు సంబంధం ఉంది కాబట్టి.. సురేష్ బాబు పెదమామ అయితే, తమ్ముడు వెంకటేష్ చినమామే కదా. అదే లాజిక్ తో వెంకీని చినమామా అంటూ ట్విట్టర్ లో మెసేజ్ లు పెడుతోంది.