325 మంది చిన్నారులను రక్షించిన 'ఆపరేషన్ స్మైల్-v'

SMTV Desk 2019-01-29 16:01:22  Telangana police, Rescue chilren, child labour, operation smile-V

హైదరాబాద్, జనవరి 29: హైదరాబాద్ పోలీసులు చిన్నారుల సంరక్షణ కోసం ఆపరేషన్ స్మైల్-V అనే కార్యక్రమాన్ని జనవరి 1న చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 325 మంది పిల్లలను చైల్డ్ లేబర్ బారినుంచి రక్షించగా అందులో 52 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించారు. మిగతా 252మంది పిల్లలను సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి పోలీసులు 17 బృందాలుగా విడిపోయి రాష్ట్రమంత గాలించారు.

ఈ విషయంపై తెలంగాణా సీపి అంజనీ కుమార్ మాట్లాడుతూ "ఇందులో 10 సంవత్సరాలలోపు పిల్లలు ఏడుగురు, 11 నుంచి 14 మద్య వయసు వారు 38 మంది పిల్లలు, మిగతా 280 మంది పిల్లలు 14-18 మద్య వయసు గలవారు ఉన్నారు. మొత్తం 14 చైల్డ్ లేబర్ కేసులు నమోదు చేయగా, యజమానులపై 6.25 లక్షల జరిమానా విధించబడింది. రక్షించిన పిల్లల్లో 100 మంది ఆంద్ర ప్రదేశ్, బీహార్, నేపాల్, ఝార్ఖండ్ ఉతరప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన వారు ఉన్నారు"అని తెలిపారు. అంతేకాకుండా వారిలో ఇద్దరు పిల్లలను పోలీసులు చొరవ తీసుకొని స్కూల్ లో చేర్పించారు.