ధోని రికార్డును సమం చేసిన హిట్ మాన్

SMTV Desk 2019-01-29 15:04:59  Rohith sharma, MS Dhoni, ODI, Test series, Six Records,

న్యూ ఢిల్లీ, జనవరి 29: భారత క్రికెట్ జట్టు ఆటగాడు రోహిత్ శర్మ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ ల రికార్డును సమం చేశాడు. ఈ మధ్య జరిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో రోహిత్ శర్మ దూకుడుగా ఆడి ఈ రికార్డును సమం చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ 3-0 స్కోరుతో సిరీస్ ను సమం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించి మూడో వన్డేలో 77 బంతుల్లో 62 పరుగులు చేసి భారత బ్యాట్స్ మెన్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో అతను రెండు సిక్స్ లు బాదాడు. దాంతో ధోనీ రికార్డును సమం చేయగలిగాడు.

ఇక ధోని విషయానికొస్తే 337 వన్డేల్లో 222 సిక్స్ లు బాదాడు. ఏడు సిక్స్ లు ఏషియా ఎలెవన్ తరఫున ఆడుతూ కొట్టాడు. ఆ రకంగా ధోనీ ఖాతాలో 225 సిక్స్ లు ఉన్నాయి. న్యూజిలాండ్ పై జరిగిన మూడో వన్డేలో ఫెర్గూసన్ వేసిన బంతిని సిక్స్ కు తరలించడం ద్వారా వన్డేల్లో 215 సిక్స్ లు కొట్టిన రికార్డు నెలకొల్పాడు. తరువాత మూడో వన్డేలో ధోనికి గాయం కారణంగా దూరమయ్యాడు. దాంతో అతను తన సిక్స్ ల సంఖ్యను పెంచుకోలేకపోయాడు. ధోనీ ఫిట్ గా ఉంటే న్యూజిలాండ్ తో జరిగే రెండు వన్డేలు ఆడుతాడు. దీంతో రోహీత్, ధోనీ సిక్స్ ల విషయంలో పోటీ పడే అవకాశం ఉంది. సిక్స్ ల విషయంలో రోహిత్, ధోనీ అగ్రస్థానంలో ఉండగా సచిన్ టెండూల్కర్ 195 సిక్స్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. సౌరవ్ గంగూలీ 189 సిక్స్ లతో, యువరాజ్ సింగ్ 153 సిక్స్ లతో తర్వాత స్థానాల్లో నిలిచారు.