శర్వా కంటే ఎక్కువే....

SMTV Desk 2019-01-29 13:54:52  Akkineni samanta, Sharwanand, 96 Movie, Artist remuneration

హైదరాబాద్, జనవరి 29: అక్కినేని సమంత పెళ్ళైన తరువాత తన రూటే మార్చింది. ఈ భామకు తన పెళ్లి బాగానే అచ్చొచ్చింది అని చెప్పుకోవచ్చు. మాములుగా పెళ్ళైన హీరోయిన్లకు అవకాశాలు చాల తక్కువ కాని ఇక్కడ మాత్రం మొత్తం రివర్స్. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా సరికొత్త కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కొరియన్ సినిమా మిస్ గ్రానీ రీమేక్ లో నటిస్తోంది. అలానే తన భర్త నాగచైతన్యతో కలిసి మజిలీ అనే సినిమా చేస్తోంది. రీసెంట్ గా 96 రీమేక్ లో నటించడానికి అంగీకరించిందని టాక్.

ఈ సినిమాలో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. తెరపై శర్వా, సమంతల కాంబినేషన్ ఫ్రెష్ నెస్ ని తీసుకొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సమంత చాలా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో కంటే సమంతకే ఎక్కువ ఇస్తున్నట్లు సమాచారం. సాధారణంగా శర్వానంద్ వొక్కో సినిమాకు రెండు నుండి రెండున్నర కోట్లు తీసుకుంటూ ఉంటాడు. కాస్త పేరున్న సినిమాలకు మూడు కోట్లకు పైగానే తీసుకుంటాడు. ఇప్పుడు శర్వా కంటే ఎక్కువగా సమంతకు పారితోషికం ఇస్తున్నారట. మొత్తానికి తన హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ హాట్ టాపిక్ గా మారింది సమంతా.