అగ్రిగోల్డ్ ఆస్తులు సీజ్.. షాక్ లో అవ్వా కుటుంబం!

SMTV Desk 2019-01-29 13:18:00  Agri Gold, Hai land, AP Govt

విజయవాడ, జనవరి 29: ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపించి, లక్షలాది మంది నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను స్వీకరించిన అగ్రిగోల్డ్ సంస్థ ఆ తర్వాత బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ఏపీ ప్రభుత్వం జప్తు చేసింది. దాదాపుగా రూ.30 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ, హైదరాబాద్, గుంటూరులో ఉన్న 33 ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. మొత్తం 47.26 ఎకరాల భూమి, 4672.76 చదరపు గజాల స్థలాన్ని జప్తు చేశారు.

కాగా జప్తుచేసిన ఆస్తులన్నీ అవ్వా వెంకట శివరామకృష్ణ, అవ్వా కరుణశ్రీ, అవ్వా శివరామ్, అవ్వా శ్రీదేవి, అవ్వా సీతారామారావు, అవ్వా మాధవీలత, అవ్వా ఉదయ్ భాస్కరరావుల పేరిట ఉన్నాయి. మొత్తానికి ప్రజలను అవాక్ చేసిన అవ్వా కుటుంబానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.