బైసన్ పోలో గ్రౌండ్ కేసు పై హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2019-01-29 13:13:18  Bison polo grounds, KCR, High Court, Central Government, new Secretariat, Telangana

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త సచివాలయం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బైసన్ పోలో గ్రౌండ్స్ లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావించగా ఈ స్థలం పై హై కోర్టు లో కేసు నడుస్తున్నందున నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. కేంద్రం భూమి బదలాయింపు విషయంలో జాప్యం చేస్తూ వచ్చింది.

నేడు బైసన్ పోలో గ్రౌండ్ కేసు పై హై కోర్ట్ తుది తీర్పునిచ్చింది. ఆ స్థలం పై ఉన్న కేసులన్నీ కొట్టివేస్తూ త్వరలోనే బైసన్ ఫోలో గ్రౌండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. హై కోర్టు ఇచ్చిన తీర్పు పై తెరాస వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తునాయి.