డైరెక్టర్ కు రామ్ చరణ్ వార్నింగ్....

SMTV Desk 2019-01-29 12:18:12  Ram charan, Surender reddy, Chiranjeevi, Syeraa Narashimhareddy, Konidela productions

హైదరాబాద్, జనవరి 29: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చారిత్రాత్మక చిత్రం సై రా నరసింహారెడ్డి . ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో, అలాగే రీషూట్లు చేయడం వంటి కారణంగా ఇప్పటికే సినిమా బడ్జెట్ చేయి దాటిపోయిందని రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేస్తున్నారని అంతేకాక మొదటి నుండి సినిమా ఖర్చు విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి ఫ్రీడమ్ ఇచ్చిన చరణ్ ఇకపై అలా కుదరదని చెప్పేశాడట.

ఈ సినిమాకు సంభందించిన కీలక ఎపిసోడ్లు, యుద్ద సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిపోయాయి. మిగిలింది టాకీ పార్ట్ మాత్రమే. అయితే సురేందర్ రెడ్డి పర్ఫెక్షన్ కోసం తీసిన సీన్లే తీస్తుంటాడు. కాని ఇకపై ఈ సినిమాకు సంభందించి అటువంటి సీన్ల కోసం కాస్త జాగ్రత్త పడక తప్పదు. రామ్ చరణ్ RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా.. సై రా పనులను మాత్రం విడిచిపెట్టడం లేదు.అనుకున్న బడ్జెట్ లో సై రా ను పూర్తి చేస్తేనే లాభాలు వస్తాయి. లేదంటే కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోతుంది. అందుకే చరణ్ ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.