సినిమా విడుదలకి ముందే పెరిగిన దర్శకుడి క్రేజ్

SMTV Desk 2019-01-28 18:23:33  Allu Arjun, Sujeeth, Prabhas Sahoo, UV Creations

హైదరాబాద్, జనవరి 28: సుజీత్ రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అంతలోనే తన రెండవ సినిమాకే జాక్ పాట్ కొట్టేసాడు. అతను ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగానే చిత్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సుజీత్ మరో సినిమాను కూడా నిర్మించడానికి సిద్ధమైంది.

ఈ సినిమా లో హీరోగా అల్లు అర్జున్ ని అనుకుంటున్నారని తెలుస్తుంది. తాజాగా అల్లు అర్జున్ తనకు UV క్రియేషన్స్ తో వొక మూవీ చేయాలనీ ఉందని ప్రకటించాడు. అంతే కాకుండా అల్లు అర్జున్ సుజీత్ కి తనకోసం వొక మంచి కథ రాయమని చెప్పాడని సమాచారం. దీన్ని బట్టి చుస్తే సాహో తర్వాత సుజీత్ అల్లు అర్జున్ సినిమా పట్టాలెక్కనుందని అనుకోవచ్చు.