ఉత్తరకొరియాకు అర్ధమయ్యేనా!

SMTV Desk 2017-07-31 18:51:02  North Korea VS USA, USA, North Korea, USA fights North Korea

అమెరికా, జూలై 31: ఇటీవల ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలతో అమెరికాను భయపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఉత్తరకొరియాకు సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో అమెరికా తమ అమ్ములపొదిలోని క్షిపణిని ప్రయోగించి, తమ వద్దనున్న అత్యాధునికి క్షిపణి ధ్వంసక వ్యవస్థతో దానిని గాల్లోనే నిర్విర్యం చేసింది. ఉత్తరకొరియా అనుకుంటున్నట్లు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అమెరికాను చేరడం సాధ్యం కాని పని అని, ఒకవేళ ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం చేసినా, దాన్ని గాల్లోనే అదుపుతప్పించగలమని అమెరికా స్పష్టం చేసి చూపించింది. టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ పరీక్షను అలస్కా నుంచి ప్రయోగించినట్లు అమెరికా అధికార వర్గాల సమాచారం.