కొత్త మెగా హీరో కి ఎవరు అండగా నిలుస్తారో...?

SMTV Desk 2019-01-28 18:02:06  Vaissnav Tej, Ram Charan, Allu Arjun, Sukumar, Sai dharam Tej

హైదరాబాద్, జనవరి 28: క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ కి టాలీవుడ్ లో వొక ప్రత్యేక స్థానం ఉంది. స్టార్ హీరోలకు సరైన సమయంలో హిట్స్ ఇచ్చి ఆదుకున్నాడు. అల్లు అర్జున్ కి ఆర్య సినిమాతో బ్రేక్ ఇచ్చాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కి నాన్నకి ప్రేమతో తో బ్లాక్ బస్టర్ ని, మరియు రామ్ చరణ్ కి రంగస్థలం తో తిరిగి లేని క్రేజ్ సంపాదించి పెట్టాడు. ఈయన ఇటీవల సుకుమార్ రైటింగ్స్ అనే పేరుతో చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. మెగా ఫామిలీ హీరో పంజా వైష్ణవ తేజ్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేయడానికి తన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వొక సినిమా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో వొక కీలక పాత్ర ను వొక పెద్ద హీరో చేత చేయించాలని సుకుమార్ ఆలోచిస్తున్నాడు. దానివాళ్ళ సినిమా మీద మంచి హైప్ క్రీస్తే అవుతుందని సుకుమార్ ప్లాన్. అయితే ఏ పాత్ర కోసం మొదట వైష్ణవ తేజ్ అన్న అయిన సాయి ధరమ్ తేజ్ ను సంప్రదించగా, వరుస ఫ్లాప్ లలో ఉండడం వల్ల తాను ఇప్పుడు ఆ పాత్ర చేయడం కరెక్ట్ కాదని తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు సుకుమార్ ఆ పాత్ర కోసం బన్నీ మరియు రామ్ చరణ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు మెగా హీరోలలో ఏ హీరో వైష్ణవ్ తేజ్ కి అండగా నిలుస్తాడో చూడాలి.