'ఇస్మార్ట్' హీరోయిన్ ఎవరు ?....

SMTV Desk 2019-01-28 17:29:04  iSmart Shankar, Ram, Puri Jagannath, Nidhi Agarwal, Charmie, Nabha Natesh, Anu immanual

హైదరాబాద్, జనవరి 28: సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ . ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలై మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దర్శకుడు పూరి తన సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నటి ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరన్నది మాత్రం ప్రకటించలేదు. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేష్ వంటి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. మొత్తానికి తాజాగా ఈ చిత్ర హీరోయిన్ ను ప్రకటించారు. సవ్యసాచి , మిస్టర్ మజ్ను లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా నటించనుందని, చిత్ర యూనిట్ వొక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఈ పోస్టర్ లో నిధి అగర్వాల్ ఇస్మార్ట్ గాళ్ అని కాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని వార్తలు రాగా చిత్ర యూనిట్ మాత్రం వొకే హీరోయిన్ పేరుని ప్రకటించడంతో రెండో హీరోయిన్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.