సీఎంకి చుక్కలు చూపిస్తున్న అధికారులు..

SMTV Desk 2019-01-28 16:43:06  Chandrababu, Teleconference, chukkala lands, government officers

అమరావతి, జనవరి 28: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు అమరావతిలో జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా జన్మభూమి సమావేశాల్లో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇంకా అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చుక్కల భూముల సమస్యను ఇప్పటివరకూ పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చుక్కల భూముల విషయంలో అధికారులు తనకే చుక్కలు చూపుతున్నారని వ్యాఖ్యానించారు. పాత రూల్ బుక్ పట్టుకుని ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు.