వరుస హిట్లు కొట్టినా హ్యాపీగా లేని యంగ్ హీరో

SMTV Desk 2019-01-28 16:08:12  Varun Tej, Fidaa, F2, Sai Pallavi, Venkatesh, Anthariksham, Tholi Prema

హైదరాబాద్, జనవరి 28: వొక హీరో సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తే ఆ హీరో క్రేజ్ రెట్టింపవుతుంది. కాని వరుణ్ తేజ్ విషయంలో ఆలా జరగలేదు. తాను నటించిన రెండు సినిమాలు ఫిదా , F2 50 కొట్ల వసూళ్లు రాబట్టినప్పటికి , ఫిదా క్రెడిట్ మొత్తం సాయి పల్లవి కొట్టేసింది. అలాగే F2 క్రెడిట్ వెంకటేష్ కొట్టేసాడు. వరుణ్ తేజ్ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ, తగినంత క్రేజ్ సంపాదించుకోలేక పోతున్నాడు.

వరుణ్ తేజ్ అంతరిక్షం వొక ప్రయోగాత్మక చిత్రంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. మరో చిత్రం తొలి ప్రేమ మంచి విజయాన్ని సాధించింది కానీ, 25 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అందుకే ఇపుడు వరుణ్ తేజ్ సోలోగా హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వొక సినిమా చేయబోతున్నాడు.