హీరో కోసం కథని మారుస్తున్న డైరెక్టర్

SMTV Desk 2019-01-28 15:42:46  Valmiki, Harish Shankar, Varun Tej, Jigarthanda

హైదరాబాద్, జనవరి 28: గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చాలాకాలం తర్వాత మళ్ళీ తన ప్రతిభను చూపించడానికి సిద్ధమయ్యాడు. హరీశ్ శంకర్ తాజాగా మరో రీమేక్ తో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. 2014 లో తమిళం లో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాని తెలుగు లో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమా కి 'వాల్మీకి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

అయితే ఇది తమిళ రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ ఈ సినిమా కథను హీరో బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మరియు నేటివిటీ కి తగినట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నాడు. తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ తరహా పాత్రను చేయడానికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ
సినిమా తమిళ్ క్లైమాక్స్ లో బాబీ సింహా పాత్ర కామెడీగా మారిపోతుంది. కాగా తెలుగులో మాత్రం ఆ పాత్రను హైలైట్ చేస్తూ క్లైమాక్స్ లో మార్పులు చేయనున్నారు. ఇక తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్ర తెలుగులో ఎవరు చేస్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.