ఏ. ఎన్. ఆర్ బయోపిక్ పై నాగ్ స్పందన

SMTV Desk 2019-01-27 16:32:45  NTR Biopic, ANR biopic, Nagarjuna,

ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులలో మొదటి పార్ట్ గా వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు పెద్దగా ఆకట్టుకోలేదు. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా టాక్ బాగున్నా కలక్షన్స్ మాత్రం డీలా పడ్డాయి. సంక్రాంతి సీజన్ లో వచ్చి ఇంత దారుణమైన వసూళ్లు రాబట్టడం అందరిని ఆశ్చర్యపరచింది. ఇక ఇప్పుడు అందరి చూపు రాబోతున్న ఎన్.టి.ఆర్ మహానాయకుడు మీద ఉంది.

ఇక ఎన్.టి.ఆర్ బయోపిక్ రిలీజ్ టైంలో ఏయన్నార్ బయోపిక్ ప్రస్థావన కూడా వచ్చింది. నాగార్జున కూడా ఏయన్నార్ బయోపిక్ ఆలోచిద్దాం అన్నట్టుగా ఉన్నాడు. కాని ఎన్.టి.ఆర్ బయోపిక్ నిరాశపరచడంతో ఏయన్నార్ బయోపిక్ పై కూడా ఆశలు వదిలేశాడు. వొకవేళ ఎన్.టి.ఆర్ బయోపిక్ హిట్టైతే ఏయన్నార్ జీవిత కథను నాగార్జున తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేసేవారేమో కాని ఆ రిజల్ట్ చూశాక కూడా అంత సాహసం చేస్తాడని అనుకోరు. అందుకే అఖిల్ మిస్టర్ మజ్ను ప్రమోషన్స్ లో ఏయన్నార్ బయోపిక్ ఆలోచన లేదని కచ్చితంగా చెప్పాడు నాగార్జున. నాన్న గారి సినిమాలు రీమేక్ చేయడానికి సాహసించని తాము బయోపిక్ చేయలేమని ముందే జాగ్రత్త పడ్డాడు నాగ్. మొత్తానికి ఎన్.టి.ఆర్ సినిమా ఫెయిల్యూర్ నాగార్జున మీద బాగా పడిందని చెప్పొచ్చు.