'పెళ్లిచూపులు' దర్శకుడితో హాట్ యాంకర్ రొమాన్స్..

SMTV Desk 2019-01-27 15:25:58  Tharun bhasker, Pellichoopulu director, Vijay devarakonda, Hot anchor, Anasuya, Jabardasth anchor

హైదరాబాద్, జనవరి 27: విజయ్ దేవేరకొండతో పెళ్లిచూపులు తీసి హిట్ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇపుడు అదే టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తో హాట్ యాంకర్ అనసూయ రొమాన్స్ చేయబోతోంది. వివరాల్లోకి వెళ్తే, ఈ చిత్రం నాలుగు క్యారెక్టర్ల మధ్య కొనసాగుతుంది. తనను హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ను ఈ చిత్రంలో హీరోగా విజయ్ పరిచయం చేయబోతున్నాడు.అదేనండీ సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడన్నమాట. తరుణ్ కు జోడీగా అనసూయ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ విజయ్ కు చెప్పడంతో... ఆయన కూడా వొప్పుకున్నట్టు సమాచారం. వీరిద్దరి మధ్య కెమిస్టరీ బాగా వర్కవుట్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.