ఆకలితో వీరంగం సృష్టించిన ఏనుగు

SMTV Desk 2017-07-31 16:28:26  bangal, midnapoor, Elephant, jengal, Potato, Larry

ఖరగ్ పూర్ , జూలై 31 : బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఏనుగు రోడ్డుపైకి వచ్చి హాల్ చల్ సృష్టించింది. గడబెత్తా అటవీ ప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారి పైకి ఏనుగు వచ్చి ఆకలితో వాహనాలను ఆపివేసింది. అటు వైపుగా వెళుతున్న లారీని ఆపిన ఓ ఏనుగు అందులోని ఆలు గడ్డలను తీనేసి, లారీకి కట్టిన తారపంను చించిమరీ బంగాలదుప్పలను కింద పడేసి ఆరగించింది. దీంతో ఆ మార్గంలో కొద్దీ గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి వాహనాలన్నీ నిలిచిపోయాయి. అయితే ఈ ఏనుగును నివారించేందుకు అటవీ అధికారులు బాణ సంచాలు పేల్చినా ఎంత మాత్రం చెలించ కుండా ఆకలి తీరాకే అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయింది.