షారుక్ స్థానం లో యంగ్ హీరో !

SMTV Desk 2019-01-27 13:03:11  Superstar Sharuk khan, Bollywood, Rakesh sharma bio-pic, Aero space movie

ముంబై, జనవరి 27: బాలీవుడ్ లో సూపర్ స్టార్ ఇమేజ్ భారీ ఫ్యాన్ బేస్ వున్న హీరో షారూఖ్‌ ఖాన్‌. వరుస విజయాలతో బాలీవుడ్ ని ఏలిన నాయకుడు ఈయన. కానీ ఈ మధ్య వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. విషయానికొస్తే బాలీవుడ్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి భార‌తీయ వ్యోమ‌గామి రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు కొద్ది రోజులుగా స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రాకేష్ శ‌ర్మ పాత్ర‌లో ముందుగా అమీర్ ఖాన్ అనుకున్న‌ప్ప‌టికి త‌ర్వాత షారూఖ్ ఖాన్ ఫ్రేంలోకి వ‌చ్చాడు. షారూఖ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ బ‌యోపిక్ రూపొందుతుంద‌ని అంద‌రు భావిస్తున్న క్ర‌మంలో యురి స్టార్ విక్కీ కౌశ‌ల్, రాకేశ్ శ‌ర్మ బ‌యోపిక్‌లో న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇదంతా పుకారేనని చిత్ర ర‌చ‌యిత ర‌జ‌బ‌లి కొట్టి పారేశారు. కాని ఈ వార్త ప్ర‌స్తుతం బాలీవుడ్ నాట హాట్ టాపిక్ గా మారింది. రాకేశ్ శ‌ర్మ బ‌యోపిక్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్ర‌వరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. సెల్యూట్ లేదా సారే జ‌హ‌సే అచ్చా టైటిల్స్ లో వొక టైటిల్‌ని ఈ మూవీకి ప‌రిశీలిస్తున్నారు. మ‌హేష్ మ‌హ‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని రొన్ని స్క్రూవాలా, సిద్ధార్ద్ రాయ్ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. తొలి బాలీవుడ్‌ స్పేస్ మూవీగా ఈ చిత్రం రికార్డులకెక్కడం ఖాయమని పలువురు సినీ పండితులు చెబుతున్నారు.