తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

SMTV Desk 2019-01-27 11:50:38  Tspsc, Unemployement, Notifications, Telangana government

హైదరాబాద్, జనవరి 27: నిరుద్యోగ యువతీయువకులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
రాబోయే వారం రోజుల్లో 3,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేస్తామని ప్రకటించింది. ఈ విషయమై టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 18,000 ఉద్యోగాలను భర్తీ చేశామని వొక్క 2018 లోనే 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు నియామక ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు.
కేవలం నాలుగేళ్ల కాలంలో ఏకంగా 20,000 ఉద్యోగాలు ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో లోపాలు, కోర్టు కేసుల నేపథ్యంలో టీఎస్పీఎస్సీకి సంబంధం లేకపోయినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు.