వాల్మీకిగా వరుణ్ తేజ్

SMTV Desk 2019-01-27 11:15:37  Valmiki, f2, varun tej, harish Shanker

హైదరాబాద్, జనవరి 27: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్ వరుస హిట్లతో ఊపుమీదఉన్నాడు . ఇటీవల ‘F2 చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వరుణ్‌ త్వరలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను, కాన్సెప్ట్ పోస్టర్‌ను హరీశ్‌ తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాకు ‘వాల్మీకి అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌లో తుపాకీ, సినిమా రీల్‌ చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమిళంలో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన ‘జిగర్తాండ కు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఫిబ్రవరి నుంచి షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.