నాని సరసన వింక్ గర్ల్ !

SMTV Desk 2019-01-27 11:11:55  Priya Prakash varrior, Natural Star nani,

హైదరాబాద్, జనవరి 27: మలయాళీ సెన్సషనల్ నటి ప్రియా వారియర్ ‘ఓరు ఆధార్ లవ్ సినిమా సమయంలో కన్నుకొట్టి అందరిని బుట్టలో పడేసింది. లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు, ఆ క్రేజ్ ను తన కెరీర్ కు అనుగుణంగా ఎలా మార్చుకోవాలో అర్ధం కాలేదట.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికీ అప్పట్లో కొన్ని కారణాల వలన వదిలేసుకోవలసి వచ్చింది. ఓరు ఆధార్ లవ్ సినిమాను తెలుగులో లవర్స్ డే పేరుతో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవలే హైదరాబాద్ వచ్చింది ప్రియా వారియర్. హైదరాబాద్ వచ్చి వెళ్ళాక ఈ వింక్ గర్ల్ కు టాలీవుడ్ నుంచి అఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. నాచురల్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా వారియర్ అవకాశం లభించించిందని సమాచారం.