మీడియాకు దొరికిపోయిన కేఏ పాల్..

SMTV Desk 2019-01-26 17:18:26  KA Paul, prajasanthi party, chandra babu, ys jagan, pavan kalyan, TDP, YCP, Janasena party

అమరావతి, జనవరి 26: ఆంధ్రప్రదేశ్ లో కేఏ పాల్ కొత్తగా ప్రజాశాంతి పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీని గెలిపిస్తే వొక్కో నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇస్తామని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఇక టీడీపీ, వైసీపీలు తీవ్ర అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించిన పాల్.. తనతో కలిసి పని చేయాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పిలుపునిచ్చారు. అలాగే తాను సీఎం అయితే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లు తెస్తానని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.

ఇక తాజాగా తన మాటలకు విరుద్ధంగా ప్రవర్తించి కేఏ పాల్ కెమెరాకు దొరికిపోయారు. బయట మీడియా ముందు టీడీపీ, వైసీపీ, లను ఏకిపారేస్తున్న పాల్.. కెమెరా ఆఫ్ లో ఉందనుకుని మీడియాకు అడ్డంగా దొరికిపోయాడు. ‘పవన్ ఔటు.. ఇప్పుడు జగన్ ఔటు.. బాబుకు వచ్చేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది.