నేను పాల్ కాళ్లు పట్టుకున్న మాట వాస్తవమే.. కానీ

SMTV Desk 2019-01-26 17:04:30  KA Paul, RGV, ram Gopal Varma, Prajashanthi

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడి పై హాస్యాస్పద వ్యాఖ్యలు చేసాడు. గతం లో రాంగోపాల్ వర్మ 2017 ఫిబ్రవరిలో తాజ్ హోటల్‌లో తన కాళ్లు పట్టుకున్నారంటూ కేఏ పాల్ సంచలనానికి తెరతీశారు. దీనిపై స్పందించిన వర్మ … ‘నేను పాల్ కాళ్లు పట్టుకున్న మాట వాస్తవమే. కానీ మొక్కడానికి కాదు. ఆయన మెదడు దెబ్బతిన్నట్టు అనిపించింది. ఆయన కాళ్లు పట్టుకొని కిందకి లాగేస్తే.. కిందపడి తల సెట్ అవుతుందేమో అనే ఆశతో అలా చేశా.కానీ, జీసస్‌ని పంపి నన్ను ఏమైనా చేస్తాడనే భయంతో వెంటనే ఆ ప్రయత్నాన్ని మానుకున్నా అని సెటైర్ వేశారు.

‘త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కేఏ పాల్‌కు వొక్క ఓటు కూడా రాదు. కేఏ పాల్ కూడా తన ఓటు తాను వేసుకోడట. ఈ విషయం నాకు జీసస్ క్రిస్ట్ చెప్పారు అని వర్మ ట్వీట్ చేశారు.

దీంతో నెటిజన్లు వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణను చూసి ఎంజాయ్ చేస్తున్నారు… దీనిపై పాల్ ఏవిధంగా స్పందిస్తారో చూద్దాం.