ఉద్దానం సమస్యకు గల కారణాలను చంద్రబాబుకు తెలిపిన హార్వర్డ్ బృందం

SMTV Desk 2017-07-31 15:43:36  Report by harvard doctors about uddanam, Pawan uddanam Report, AP CM, chandrababu

అమరావతి, జూలై 31: ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడానికి గల మూలాలను హార్వర్డ్ వైద్య బృందం ఏపీ సీఎం చంద్రబాబుకు వెల్లడించింది. వీరు త్రాగే నీటిలో సిలికా, గాలియం అధికంగా ఉందని, వీరు పెయిన్ కిల్లర్స్ అధిక మొత్తంలో వాడటం వల్ల కూడా కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించింది. ఇక్కడ ఎండ ఎక్కువని, నీరు సరిపడేంత తాగక పోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతోందని ఈ బృందం తేల్చింది. డాక్టర్స్ బృందం కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి రోగులతో మాట్లాడిన తరువాత వారు తయారు చేసిన దర్యాప్తు నివేదికలో వివరాలు సీఎంకు తెలిపారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అధిక కలుషితాలను కలిగి వున్నాయని వివరించింది.