సమంత ఫిట్ నెస్ వీడియో చూసారా !

SMTV Desk 2019-01-26 15:16:35  samantha, Samantha fitness video

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్‌ సమంత ఫిట్‌నెస్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదు. ఆమె నూతన కసరత్తులతో తెగ సాధన చేస్తున్నారు. తాజాగా జిమ్‌లో తీసిన ఫొటో, వీడియోను సామ్‌ తన అధికారక ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్‌ చేశారు. అందులోని ఫొటోలో ఆమె చేతులపై శరీరాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ కనిపించారు. జిమ్‌ ట్రైనర్‌ జాక్సన్‌ ఆమెకు శిక్షణ ఇస్తూ పక్కన నిలబడ్డారు. ఈ ఫొటో చూసిన అభిమానులు సమంతపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘అద్భుతం, సూపర్‌ వుమెన్‌, మీలో కష్టపడేతత్వం ఉంది కాబట్టే అందరూ ఇంతగా ఇష్టపడుతున్నారు, స్ఫూర్తిదాయకం.. అంటూ తెగ కామెంట్లు చేశారు.అంతేకాదు పల్టీ కొడుతున్న వీడియోను షేర్‌ చేస్తూ.. ‘దీన్ని మా మామ నుంచి నేర్చుకున్నా అని సమంత పేర్కొన్నారు. ఆమె మామయ్య, అగ్ర హీరో అక్కినేని నాగార్జున కూడా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యం ఇస్తుంటారు. అందుకే ఆయన 59ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా ఫిట్‌గా కనిపిస్తున్నారు.