'మిస్టర్ మజ్ను' ఫస్ట్ డే కలెక్షన్స్..

SMTV Desk 2019-01-26 13:46:13  Akhil, Mr.Majnu, nidi agarwal, venky atluri, BVSN Prasad, mr.majnu first day collections

హైదరాబాద్, జనవరి 26: అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమాను తెరకెక్కింది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. కాగా నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ లుక్ కి .. ఆయన డాన్స్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి కానీ మొత్తం మీద ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 4.5 కోట్ల షేర్ ను రాబట్టింది. తన మొదటి చిత్రమైన అఖిల్ తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 7 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక రెండవ చిత్రమైన హలో 3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే అఖిల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా రాబట్టిన తొలిరోజు వసూళ్లు తక్కువగా ఉండటం అభిమానులను నిరాశ పరుస్తోంది. కాగా వీకెండ్ లో ఈ చిత్ర వసూళ్లు పెరిగే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.