'బిగ్ బాస్ 3'కి మళ్ళి ఆయనే..

SMTV Desk 2019-01-26 12:20:25  SS Rajamouli, NTR, Ram Charan, RRR Movie, Big boss 3, big boss 3 host, star maa

హైదరాబాద్, జనవరి 26: స్టార్ మా నిర్వహించిన బిగ్ బాస్ షో ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ షో లో పాల్గొన్న నటీనటులకు చాలా పేరు వచ్చింది. ఇక ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా మూడో సీజన్ స్టార్ట్ చేయడానికి స్టార్ మా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ వేదికపై ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన హోస్ట్ గా చేసిన ఈ కార్యక్రమంతో ఛానల్ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. ఆ తరువాత ప్రసారమైన సీజన్ 2కి నాని హోస్ట్ గా వ్యవహరించి, తనదైన శైలిలో మెప్పించాడు.

ఇక ఇప్పుడు 3వ సీజన్ కి మొదట చిరంజీవి గానీ .. వెంకటేశ్ గానీ హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపించింది. కానీ కొత్తగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. మరల ఎన్టీఆర్ హోస్ట్ గా సీజన్ 3 చేయాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ 3 నిర్వాహకులు ఉన్నారట. దీనిపై ఎన్టీఆర్ ను సంప్రదించగా ఆయన అంగీకరించాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ .. రాజమౌళితో మల్టీ స్టారర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ చిత్ర షూటింగుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బిగ్ బాస్ 3 షూటింగును ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వొక సినిమాకి ఎన్టీఆర్ ఎంత పారితోషికం తీసుకుంటాడో .. బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరించినందుకు ఆయన అంతే మొత్తం తీసుకుంటున్నట్టుగా సమాచారం.